Saturday, April 20, 2013

వివరాలు చెప్పండి

సరైన సమాధానానికి ఒక మంచి బహుమతి......శ్రీ రామ నవమి అనేది రాముడి పుట్టిన రోజా.... పెళ్లి రోజా....పుట్టిన రోజు అయితే నవమి నాడు కళ్యాణం ఎందుకు చేస్తారు....వివరణ తో మీ సమాదానం పంపండి..... మీ రాజారాం రెడ్డి....rajaramreddy.mallela@gmail.com

Saturday, April 13, 2013

తప్పు ఎవరిది...

మంత్రి ఆనం గారు... ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎన్నికలలో పోటి చేసే మొదలు రాజ్యాంగబద్దం గా చట్టానికి తప్ప, యెంత పెద్దవారైనా,కుటుంబ సభ్యులకైనా ఏ ఒక్కరికి కూడా ప్రజలకు అన్యాయం జరిగే పనులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సమ్మతించం అని భారత రాజ్యాంగం పై ,ఇష్టమైన దేవుళ్ళు పై,అమ్మానాన్నలపై ప్రమాణాలు చేసి తొలి అడుగు వేస్తాము... మరి ఒక రాష్ట్ర మంత్రి గా తమరు ,తమ సహచర చోటా, బడా నాయక , మంత్రివర్య సహచరులు రాజకీయ ప్రస్తానం లో నేటికి ఎన్ని అడుగులు వేసివుంటారు - ఎన్ని సార్లు రాజ్యాంగం పై ప్రమాణం చేసివుంటారు.మరి మీరు పత్రికా ముఖం గా తప్పు అంతా దివంగత ముఖ్యమంత్రి రాజ శేఖర్ రెడ్డి గారిదేనని , నాటి అధికారులు, మంత్రులంతా పత్తిగింజలని ఎలా చెబుతారు .నేటివరకు అధికారికంగా, అనధికారికంగా జరిగిన రాష్ట్ర కేబినేట్ , బాగా అత్యున్నత చదువులు చదివిన అధికారులతో జరిపిన సమావేశాలలో ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ముఖ్య నాయకుడు ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నపుడు వ్యతిరేకించినవారు గాని, దానిపై తప్పుఅని నోట్ పెట్టినవారు గాని వున్నారా... ప్రభుత్వం ఒక జీ.ఓ తేవడానికి తీసుకొనే సమయం తమరికి తెలింది కాదు ,ఆ సమయంలోనైన ఏ ఒక్కరు దానిపై నోరు, కలం కదపలేదు... ఎందుకు.. ఆనాడు మేము సమావేశనికి హాజరుకాలేదు అనే సాకుని చూపకుండా చెప్పండి . ఒక వేళ మీకందరికీ బాగం లేకుండా పొతే ప్రజల పక్షన మీరు ఎందుకు నిలబడలేదు... ప్రజలకు అన్యాయం జరుగుతున్న నాడే ఎందుకు సంబందిత మంత్రి లేదా అధికారి రాజీనామా చేయలేదు ...పదవి వ్యామోహమా ,అధికార కాంక్షనా.... మనిషి వున్నపుడు ఒక మాట లేనపుడు ఒక మాటనా...రాజ్యాంగబద్దం గా ప్రమాణం చేసి, యావత్తు రాష్ట్ర ప్రజలకు మీరు నేడు ఏదైతే అన్యాయం జరిగిందని చెబుతున్నారో ఆనాడు మీరు ,మీ సభ్యులు ఏఒక్కరు నేటికి ఎందుకు భాద్యత వహించడం లేదు. రాజ్యాంగపరం గా నాటి తప్పుకు మీకందరికీ ఒక శిక్ష అనేది వుండివుంటే ఇలాంటి అన్యాయం ప్రజలకు జరిగేదా... దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి.. ఇలాంటి తప్పు చేసినవారికి రాజ్యాంగం గానీ , చట్టం లో గానీ సరైన శిక్ష,మార్గదర్శకాలు చూపని రాజ్యంగానిదా .... నాయకులైన మీరందరూ ప్రజల పక్షాన వుండి పోరాడుతారని నమ్మిన ప్రజలదా... లేదా తిన్నాం తిన్నాం అనే కథ లో చిటికెన వేలు చెప్పినట్లు 'తిని ఎవడి దారిన వాడు పోదాం 'అనే అధికార, రాజకీయ నాయకులదా.... నాడు ఏం చేస్తున్నారు ఈరోజు ఎందుకు ఆక్రోషిస్తున్నారు అని అడగలేని పత్రికలదా ... తప్పు యెవరిది.. ఇది ఒక్క మీ పార్టిలోనే కాదు అన్ని పార్టిల సమస్య అనేది నా అభిప్రాయం .... దీనిపై ఎవరిది బాధ్యత.....ఆలోచించండి... ముఖ్యంగా స్టేనోగ్రాఫర్ లా పని చేయకుండా అన్ని పత్రికలూ ప్రజల పక్షాన సమస్యలపై వివేకంతో ప్రశ్నించడం లేదా బాధ్యత తో కూడిన రచనలను తమ పత్రికలలో కాస్త చోటు కల్పించడం వారి కనీస బాధ్యత.....నమస్కారాలతో మీ, రాజారాం రెడ్డి . యం 9440280700.....