Thursday, July 11, 2013

విదేశీ పారిశ్రామికవేత్తలకు స్వాగతం.....మా దేశంలో పెట్టుబడులు పెట్టడానికి భారతావని ఒక పాడిఆవు...దయచేసి మీరు పరిశ్రమలు పెట్టేముందు 1.మా దేశ రాజకీయ నాయకులు స్వార్థం కొరకు ఏ దశలో కూడా ( ప్రజలకు అన్యాయం జరిగితే తప్ప)వారి జోక్యం ఉండకుండా...2.కుల, మత ,ప్రాంతాలకు భేదం లేకుండా ...కేవలం ప్రతిభకే ఉద్యోగం ఇచ్చేలా...భారత రాజ్యంగ పూర్వక అగ్రిమెంట్లు పొంది రండి...అలా కానీ చొ...దినాము పంచాయితీలే...
RESPECTED INDUSTRIALISTS WELCOME TO INDIA....WE HAVE WELL RAW MATERIALS A LOT IN MY COUNTRY ....BUT BEFORE U R ESTABLISHING A INDUSTRY Pls TAKE CONSTITUTIONAL AGREEMENT WITH GOVT OF INDIA ON 1.NO POLITICAL INVOLVEMENT .....2.ONLY EFFICIENCY CANDIDATES TO RECRUIT ( NON CASTE, RACE AND RELIGION BASED) INDIA WIDE TALENT BASED....PLEASE TAKE THESE TWO STEPS BEFORE STARTING...OTHERWISE......

Saturday, April 20, 2013

వివరాలు చెప్పండి

సరైన సమాధానానికి ఒక మంచి బహుమతి......శ్రీ రామ నవమి అనేది రాముడి పుట్టిన రోజా.... పెళ్లి రోజా....పుట్టిన రోజు అయితే నవమి నాడు కళ్యాణం ఎందుకు చేస్తారు....వివరణ తో మీ సమాదానం పంపండి..... మీ రాజారాం రెడ్డి....rajaramreddy.mallela@gmail.com

Saturday, April 13, 2013

తప్పు ఎవరిది...

మంత్రి ఆనం గారు... ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎన్నికలలో పోటి చేసే మొదలు రాజ్యాంగబద్దం గా చట్టానికి తప్ప, యెంత పెద్దవారైనా,కుటుంబ సభ్యులకైనా ఏ ఒక్కరికి కూడా ప్రజలకు అన్యాయం జరిగే పనులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సమ్మతించం అని భారత రాజ్యాంగం పై ,ఇష్టమైన దేవుళ్ళు పై,అమ్మానాన్నలపై ప్రమాణాలు చేసి తొలి అడుగు వేస్తాము... మరి ఒక రాష్ట్ర మంత్రి గా తమరు ,తమ సహచర చోటా, బడా నాయక , మంత్రివర్య సహచరులు రాజకీయ ప్రస్తానం లో నేటికి ఎన్ని అడుగులు వేసివుంటారు - ఎన్ని సార్లు రాజ్యాంగం పై ప్రమాణం చేసివుంటారు.మరి మీరు పత్రికా ముఖం గా తప్పు అంతా దివంగత ముఖ్యమంత్రి రాజ శేఖర్ రెడ్డి గారిదేనని , నాటి అధికారులు, మంత్రులంతా పత్తిగింజలని ఎలా చెబుతారు .నేటివరకు అధికారికంగా, అనధికారికంగా జరిగిన రాష్ట్ర కేబినేట్ , బాగా అత్యున్నత చదువులు చదివిన అధికారులతో జరిపిన సమావేశాలలో ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ముఖ్య నాయకుడు ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నపుడు వ్యతిరేకించినవారు గాని, దానిపై తప్పుఅని నోట్ పెట్టినవారు గాని వున్నారా... ప్రభుత్వం ఒక జీ.ఓ తేవడానికి తీసుకొనే సమయం తమరికి తెలింది కాదు ,ఆ సమయంలోనైన ఏ ఒక్కరు దానిపై నోరు, కలం కదపలేదు... ఎందుకు.. ఆనాడు మేము సమావేశనికి హాజరుకాలేదు అనే సాకుని చూపకుండా చెప్పండి . ఒక వేళ మీకందరికీ బాగం లేకుండా పొతే ప్రజల పక్షన మీరు ఎందుకు నిలబడలేదు... ప్రజలకు అన్యాయం జరుగుతున్న నాడే ఎందుకు సంబందిత మంత్రి లేదా అధికారి రాజీనామా చేయలేదు ...పదవి వ్యామోహమా ,అధికార కాంక్షనా.... మనిషి వున్నపుడు ఒక మాట లేనపుడు ఒక మాటనా...రాజ్యాంగబద్దం గా ప్రమాణం చేసి, యావత్తు రాష్ట్ర ప్రజలకు మీరు నేడు ఏదైతే అన్యాయం జరిగిందని చెబుతున్నారో ఆనాడు మీరు ,మీ సభ్యులు ఏఒక్కరు నేటికి ఎందుకు భాద్యత వహించడం లేదు. రాజ్యాంగపరం గా నాటి తప్పుకు మీకందరికీ ఒక శిక్ష అనేది వుండివుంటే ఇలాంటి అన్యాయం ప్రజలకు జరిగేదా... దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి.. ఇలాంటి తప్పు చేసినవారికి రాజ్యాంగం గానీ , చట్టం లో గానీ సరైన శిక్ష,మార్గదర్శకాలు చూపని రాజ్యంగానిదా .... నాయకులైన మీరందరూ ప్రజల పక్షాన వుండి పోరాడుతారని నమ్మిన ప్రజలదా... లేదా తిన్నాం తిన్నాం అనే కథ లో చిటికెన వేలు చెప్పినట్లు 'తిని ఎవడి దారిన వాడు పోదాం 'అనే అధికార, రాజకీయ నాయకులదా.... నాడు ఏం చేస్తున్నారు ఈరోజు ఎందుకు ఆక్రోషిస్తున్నారు అని అడగలేని పత్రికలదా ... తప్పు యెవరిది.. ఇది ఒక్క మీ పార్టిలోనే కాదు అన్ని పార్టిల సమస్య అనేది నా అభిప్రాయం .... దీనిపై ఎవరిది బాధ్యత.....ఆలోచించండి... ముఖ్యంగా స్టేనోగ్రాఫర్ లా పని చేయకుండా అన్ని పత్రికలూ ప్రజల పక్షాన సమస్యలపై వివేకంతో ప్రశ్నించడం లేదా బాధ్యత తో కూడిన రచనలను తమ పత్రికలలో కాస్త చోటు కల్పించడం వారి కనీస బాధ్యత.....నమస్కారాలతో మీ, రాజారాం రెడ్డి . యం 9440280700.....

Monday, August 6, 2012

పద్యం

కీర్తి కారలతో మెప్ఫించలేని స్నేహితుడిని
కితకితల కథలు చెప్పలేని ప్రియుడిని
క్రీడించలేని మొగుడిని
పడతి పట్టించుకోదురా..రామా..
నిజం కాదంటారా..
మీ లోక విరోధి...రామన్న,

Tuesday, January 19, 2010

లంజ మాట..

తెలుగు సోదరులారా..ఈ టైటిల్ కోసమైనా నా పక్కకు చూడాలని మాత్రమే నా ఈ టైటిల్..క్షమించాలి...
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువులను పక్కన బెట్టిన విద్యార్ధులారా..
ఈ రాజకీయ నాయకుల కోసం మన చదువులను,పరీక్షలను బందుల రూపం లో,ధర్నాల రూపంలో
పాడుచేసుకోవడం సమంజమా! క్షణక్షణానికి పోటీ పెరుగుతున్న ఈ సమయం లో పరీక్షలను,చదువును
రాబందుల్లాంటి నాయకుల కోసం మనమే మన చదువులను బలి పెట్టుకోవటం అనేది కాయకష్టం చేసి తమ
పిల్లలు బాగా చదివి పట్టెడన్నం పెడతారని ఆశించే పేద,బలహీన వర్గ తల్లిదండ్రులను మన చేతులారా మరోకరి
కోసం బాధించిన వాళ్లము కామా!క్షణం పోతేనే తిరిగిరాదు..మరి మన దిన వారీ పరీక్షలు పోతే....
కాని మన పరీక్షలు పోయినా,మనమే పోయినా,నాయకులకు మాత్రం మందీమార్బలం,పదవి,హొదా,
అంగ రక్షకులు మరియూ మనలాంటి చదువుకోంటూ,పొగడ్తలకు పొంగి పోయే చాలా మంది అనాగరిక విద్యార్దులు ఎప్పటికీ ఉంటారు..
మరి మన అమ్మానాన్నలకూ..................?

చివరగా నా మాట ఏమంటే...పచ్చి తెలుగులో,"లంజ మాట వినాకు..ఇంట్లో గింజలు అమ్మాకూ"అని..
కాబట్టీ ఇక నుండి అయినా...........ఏం చేద్దాం...
నేనేమైనా నొప్పించి వుంటే....కానీ ఇది నిజం కాదా!
మీ...రామన్న(యం.రాజారాం రెడ్డి)