Tuesday, January 19, 2010

లంజ మాట..

తెలుగు సోదరులారా..ఈ టైటిల్ కోసమైనా నా పక్కకు చూడాలని మాత్రమే నా ఈ టైటిల్..క్షమించాలి...
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువులను పక్కన బెట్టిన విద్యార్ధులారా..
ఈ రాజకీయ నాయకుల కోసం మన చదువులను,పరీక్షలను బందుల రూపం లో,ధర్నాల రూపంలో
పాడుచేసుకోవడం సమంజమా! క్షణక్షణానికి పోటీ పెరుగుతున్న ఈ సమయం లో పరీక్షలను,చదువును
రాబందుల్లాంటి నాయకుల కోసం మనమే మన చదువులను బలి పెట్టుకోవటం అనేది కాయకష్టం చేసి తమ
పిల్లలు బాగా చదివి పట్టెడన్నం పెడతారని ఆశించే పేద,బలహీన వర్గ తల్లిదండ్రులను మన చేతులారా మరోకరి
కోసం బాధించిన వాళ్లము కామా!క్షణం పోతేనే తిరిగిరాదు..మరి మన దిన వారీ పరీక్షలు పోతే....
కాని మన పరీక్షలు పోయినా,మనమే పోయినా,నాయకులకు మాత్రం మందీమార్బలం,పదవి,హొదా,
అంగ రక్షకులు మరియూ మనలాంటి చదువుకోంటూ,పొగడ్తలకు పొంగి పోయే చాలా మంది అనాగరిక విద్యార్దులు ఎప్పటికీ ఉంటారు..
మరి మన అమ్మానాన్నలకూ..................?

చివరగా నా మాట ఏమంటే...పచ్చి తెలుగులో,"లంజ మాట వినాకు..ఇంట్లో గింజలు అమ్మాకూ"అని..
కాబట్టీ ఇక నుండి అయినా...........ఏం చేద్దాం...
నేనేమైనా నొప్పించి వుంటే....కానీ ఇది నిజం కాదా!
మీ...రామన్న(యం.రాజారాం రెడ్డి)